Sunday, January 31, 2010

యానిమేషన్ లెసన్స్ - శ్రీ జయదేవ్ బాబు












బొమ్మకదిలేటప్పుడు వయసు, బరువు, స్వభావము తెలియాలి. వయసులో వున్న మెలికలాంటి అమ్మాయి, నడివయసు దాటినా లావుపాటి అంటి, మోతుబరి జమిందారు, తప్పటడుగులు వేసేచంటిపిల్లాడి నడకలు వేర్వేరుగా ఉంటాయి.

ఉదాహరణ కోసం చిత్రం - 1 చూడండి.






















బొమ్మ
కదలిక స్వాభావికంగా, అర్థవంతంగా, సహజానుగునంగాకంటికింపుగా వుండాలి. అందుకు సంభందించిన "కీ డ్రాయింగులు", "ఇన్ బిట్వీన్లు", "స్పేసింగులు" ఫ్రేముల సంఖ్య సరిచూసుకోవాలి. అన్ని యానిమేషన్ సూత్రాలకు కట్టుబడి వుండాలి.

యానిమేషన్ సూత్రాలని అర్ధం చేసుకునే ముందు కొన్ని ఉదాహరణలని పరిశీలిద్దాము. బరువు వస్తు స్వభావం గురించి తెలుసుకుందాము.

ఉదాహరణ కోసం చిత్రం - 2 లో రుమాలు చూడండి.

* ఒక రుమాలు ని నేల మీదకు జార విడుద్దాం.
* గాలి తాకిడికి రుమాలు విచ్చుకుంటుంది.
* మధ్య భాగం బుడపలా లేస్తుంది.
* నేలని తాకగానే, రుమాలు కు నేలకు మధ్యన ఇరుకుకున్న గాలి బయటకు వస్తుంది.
* రుమాలు పరుచుకుంటుంది.

ఉదాహరణ కోసం చిత్రం - 3 లో పిండి ముద్ద చూడండి.

* బాగా నీరు తేరిన పిండి ముద్ద, పడుతున్నప్పుడు సాగుతుంది.
* నేల తాకగానే పరచుకుంటుంది.


















ఉదాహరణ
కోసం చిత్రం - 4 లో మట్టి ముద్ద చూడండి.

* మట్టి ముద్ద దప్ఫుమని పడుతుంది.
* నేలమీద పరచుకుంటుంది.

ఉదాహరణ కోసం చిత్రం - 5 క్యానన్ బాల్ చూడండి.

* క్యానన్ బాల్ (ఫిరంగి) ధన్ మని పది నేల మట్టి చెదురుతుంది.

తరువాత లెసన్స్ లో మరో కొత్త విషయం గురించి చర్చిద్దాము.
కూర్పు - జయదేవ్ బాబు (31 జనవరి 2010).

యానిమేషన్ లెసన్స్ ని శ్రీ జయదేవ్ బాబు గారు తెలుగుకార్టూన్ డాట్ కామ్ కోసం వ్రాసారు.
తెలుగుకార్టూన్ డాట్ కామ్ లో కూడా లెసన్స్ చదివి డౌన్లోడ్ చేసుకోవచ్చును.

కళాసాగర్ కార్టూన్లు (కార్టూన్ సంకలనం)



వ్యంగ్య భరితమైన రాతలకు గీతాలను జోడించి ఆబాల గోపాలాని నవ్వించడంమే వ్యంగ్య చిత్రాకారుల ఉద్దేశం.
శ్రీ కళాసాగర్ 1995 సంవత్సరం నుండి కార్టూన్లు గీస్తున్నారు. వివిధ పత్రికలలో వేల సంఖ్య లో ప్రచురించబడినఅత్యుత్తమమైన వాటినుండి కొన్నింటిని తీసుకుని "కళాసాగర్ కార్టూన్లు" పేరుతొ పుస్తకరూపంలో మనముందుంచారు.



కవరు పేజీ వెనుక ప్రముఖ సీనియర్ కార్టూనిస్ట్ శ్రీ జయదేవ్ బాబు గారి అమూల్యమైన అభిప్రాయం, "మనిషి ఎందుకునవ్వాలి?' అనే ప్రశ్నకు జవాబుగా శ్రీ డా|| జి. సమరం గారు వ్రాసిన విజ్ఞానదాయకమైన నాలుగు మాటలు, శ్రీ ఎవిఎం గారి అభినందనలు, సీనియర్ కార్టూనిస్ట్ శ్రీ సత్యమూర్తి శుభాకాంక్షలు, శ్రీ శేఖర్ మనసులోని మాట, ప్రముఖ కారికేచర్చిత్రకారుడు శ్రీ శంకర్ మరియు మహిళా కార్టూనిస్ట్ కుమారి శ్రీ రాగతి పండరి గారు అభినందనలు మొదట నాలుగుపేజీలలో మనల్ని పలుకరిస్తాయి.

"చిరునవ్వుల వెనుక" అంటూ తన మనోగతాన్ని శ్రీ కళా సాగర్ గారు క్లుప్తంగా చెప్పి, మొదటి కార్టూన్ నుండి చివరికార్టూన్ వరకు పుస్తకము వదలకుండా చదివి, అతి తక్కువ సమయం లో ఎక్కువ హాస్యాన్ని ఆనందిచాగాలిగామనేఆనందం మనలో కలిగించేలా పుస్తకాన్ని రూపకల్పన చేసారు. చివర్లో హేయర్ కటింగ్ సెలూన్ కార్టూన్ చూడటంపూర్తయీనాక " అయ్యో!..ఇంకా కొన్ని కార్టూన్లు వుంటే బాగుణ్ణు" అనే అత్యాస కలుగక మానదు. కొన్ని సందర్భాలలోతక్కువ" కూడా "ఎక్కువ" కిక్కు ఇస్తుందనడం లో అతిశయోక్తి కాదేమో?... "

ఇతరులని రంజింపజేయడం కళాకారుల వృత్తి మరియు ప్రవృత్తి. కార్టూనిస్టు కొన్ని (అన్ని) సందర్భాలలో తన కార్టూన్లకంటే తోటి కార్టూనిస్టుల గీతాల్ని రాతల్ని చూసి ప్రేరణ పొందుతాడు. "కళాసాగర్ కార్టూన్లు" సంకలనం చదివినాకనేనెందుకు కోవలో కార్టూన్లు గీయలేకపోతున్నాను?" అనే భావన నాలో కలిగింది. (నేనెప్పుడు మాత్రం కార్టూన్లుగీసాను? ). "


నా కొడుకు, కూతురు "మనమెవరో చాటింగ్ చేసేవాళ్ళకు తెలియదు" (పేజి 9) కార్టూన్ని భోజనం చేస్తున్నప్పుడు కూడతలచుకొని పొట్ట చెక్కలయ్యేలా నవ్వటంతో నాకు కోపం వచ్చింది. వాళ్ళిద్దరికీ చాలాసార్లు చెప్పాను "భోజనంచేస్తున్నప్పుడు పొట్టచెక్కలయ్యేలా నవ్వకూడదని".


పేజి 41 లో పొడుగుగా వున్న జంతువుని కట్టె కి కట్టి పిల్లలు అటు ఇటు పిరమిడ్ ఫార్మేషన్ లో మోసుకు వెళ్ళడంఆలోచింపజేసింది.


పేజి 55 లో కార్టూన్ నాకు చురక తగిలించింది. నా పిల్లలిద్దరూ "PS2 గేమ్ కన్సోల్" కావాలని మారం చేస్తే కొని తెచ్చాను. కొత్తలో అసలు వారిని ఆడనిచ్చే వాణ్ని కాదు. రోజులో ఎక్కువ సార్లు నేనే టీవి ముందు కూర్చొని గేమ్స్ ఆడుతూ టైంపాస్ చేస్తుండేవాణ్ని.

చెప్పాలంటే ఒకటినిమించి ఒకటి. ప్రతి కార్టూన్ లో నూతనత్వం కనిపిస్తుంది. " కార్టూన్ని గతంలో ఎక్కడో చూసా.. " అనే పాత జ్ఞాపకాల్ని నేమరువేసుకుని ఆస్కారం లేని ఆణిముత్యాలు. ప్రతి రీడర్, కార్టూనిస్ట్ పుస్తక సేకరణ జాబితాలోఉండదగ్గ మంచి సంకలనం.

శ్రీ కళాసాగర్ గారి ఇతర హానర్స్ మరియు అవార్డ్స్ గురుంచి తెలుసుకోవాలంటే చాలానే వుంది.
బ్లాగు పోస్ట్ లో కేవలం "కళాసాగర్ కార్టూన్లు" (కార్టూన్ సంకలనం) గురుంచిన ప్రస్తావన చేయ ప్రయత్నం చేసాను.
తప్పులుంటే మన్నించగలరు.

kalasagar"కళాసాగర్ కార్టూన్లు" (కార్టూన్ సంకలనం) ప్రచురణకర్త వివరాలు:
స్మైల్ పబ్లికేషన్స్,
విజయవాడ, సెల్ : 9703466104
వెల : రూ. 30/-

ప్రతుల కోసం సంప్రదించ వలసిన చిరునామా:
కళాసాగర్,
#21-11/3-13, మధుర నగర్,
విజయవాడ - 520011,
Cell : 9703466104, 9885289995

విశాలాంధ్ర బుక్ హవుస్,
ప్రజాశక్తి బుక్ హవుస్ (అన్ని బ్రాంచీలలో) లభ్యమగును.

శ్రీ కళాసాగర్ ఇతర సమాచారం కోసం మరియు మరిన్ని కార్టూన్స్ చూసేందుకు తెలుగు కార్టూనిస్ట్ డైరెక్టరీ వెబ్ సైట్తెలుగుకార్టూన్.కామ్ సందర్సించగలరు.

Tuesday, January 5, 2010

Cartoonist Kum. Ragathi Pandari


నేను విశాఖపట్నం లోనే పుట్టి పెరిగినా ఉద్యోగ పరమైన కారణాల వలన ప్రముఖ కార్టూనిస్ట్ కుమారి రాగతి పండరి గార్ని పర్సనల్ గా వెళ్లి కలుసుకోలేక పోయాను. ఎక్కొడో చెన్నై లో వున్నా మన గురుదేవ్ గారైన శ్రీ జయదేవ్ బాబు గారు రాగతి పండరి సెల్ ఫోన్ నెంబర్ నాకు ఈమెయిల్ చేసి తప్పకుండ వెళ్లి కలవమని మరి మరి చెప్పి నాకు ఆ భాగ్యాన్ని కలుగజేశారు. శ్రీ జయదేవ్ బాబు గారికి ధన్యవాదములు.

కొత్త సంవత్సరం మొదటి వారం లో సతిసమేతంగా కుమారి రాగతి పండరి గారి ఇంటికి వెళ్లి మా శుభాకాంక్షల్ని తెలియజేసుకున్నాము.

రాగతి పండరి మరియు ఆమె వదిన గారు మమ్మల్ని ఎంతో సగౌరవంగా ఆహ్వానించి ఎంతో మర్యాదపూర్వకం గా మాట్లాడారు.

శ్రీ జయదేవ్ బాబు "గ్లాచ్యు మీచ్యూ" పుస్తకావిష్కరణ సభ విశేషాలు రాగతి పండరి గారి తో ముచ్చటించినాక, తెలుగుకార్టూన్ డాట్ కామ్ గురించి చెప్పాను. రాగతి పండరి గారు తెలుగుకార్టూన్ డాట్ కామ్ కి అభినందనలు తెలియజేసి వెబ్ సైట్ కి కావాల్సిన ఫోటోలని, కార్టూన్లని అందజేశారు.

అంతేకాక ఆమె ఓ కార్టూన్ క్యారెక్టర్ గీస్తున్న సందర్భాన్ని నా డిజిటల్ కెమెరా తో చిత్రించే అవకాశం కూడా కలుగజేశారు.
ఆ సందర్భాన్ని చూసేందుకు దయచేసి ఈ దిగువన తెలియజేసిన లింక్ ను క్లిక్ చేయగలరు :
http://www.telugucartoon.com/youtubevideos.php

కుమారి రాగతి పండరి కి తెలుగుకార్టూన్ డాట్ కామ్ తరపున ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము.

Monday, January 4, 2010

Anwar : "Glachu Meetchu" Cover Page Artist



"గ్లాచ్యు మీచ్యూ" పుస్తకం ముఖ చిత్రాన్ని శ్రీ అన్వర్ డిజైన్ చేసారు.
కార్టూన్లూ, కథలకు బొమ్మలు తో పాటు కారికేచర్స్ గీయడం లో శ్రీ అన్వర్ సిద్దహస్తులు.
శ్రీ అన్వర్ గారికి అభినందనలు.

Saturday, January 2, 2010

Telugu Cartoonists Kosam_TeluguCartoon.Com

తేది 20 డిసెంబర్ 2009 న తెలుగుకార్టూన్ డాట్ కామ్ ఆవిర్భవించింది. ఆ రోజున జరిగిన కార్టూనిస్ట్ శ్రీ జయదేవ్ బాబు గారి పర్సనల్ స్టోరీస్ "గ్లాచ్యు మీచ్యు" పుస్తకావిస్కరణలో తెలుగుకార్టూన్ డాట్ కామ్ కార్టూనిస్ట్ శ్రీ మోహన్ గారి చేతుల మీదుగా హొస్ట్ చేయడం జరిగింది.



శ్రీ రాంపా గారి ఆధ్వర్యం లో "గ్లాచ్యు మీచ్యు" పుస్తకావిష్కరణ సభ ఎంతో అద్భుతం గా జరిగింది.
శ్రీ జయదేవ్ బాబు గారి బాల్యం, యవ్వనం, వివాహం, పుట్టినరోజు అన్నింటినీ ప్రదర్శించే తీరు లో వేదికని అలంకరించి, హాస్యం ఉట్టిపడేలా వుండే భాషనతోనూ, పెళ్లి మంత్రాలతోనూ ఆహుతుల్ని శ్రీ రాంపా గారు కనువిందు చేసారు. సభ నిర్వహించే తీరు అద్భుతం గా ఉండడమే కాక ఆశ్చర్యచకితుల్ని చేసింది.

ఓ పుస్తకావిష్కరణ సభ నూతనత్వం తో మిళితమై అంత అద్భుతం గా వుండబోతుందని ఎవరు ఊహించనిది.
విరామం లో కాఫీ, టీ మరియు రుచికరమైన చట్ని తో "పుణుకుల" అల్పాహార విందు ఆహుతుల్ని మరింత ఉత్సాహ పరిచింది.
సభ ఆఖరునా శ్రీ జయదేవ్ బాబు గారు తెలుగుకార్టూన్ డాట్ కామ్ వెబ్ సైట్ కోసం ప్రస్తావించారు.

ఈ అరుదైన అవకాశాన్ని కలిగించినందు కు శ్రీ రాంపా గారికి తెలుగు కార్టూన్ డాట్ కామ్ తరపు నుండి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము.

"Glachu Meetchu" Naa Personal Stories Book cover page.

Glachu Meetchu Printed and Published by:
VNR Book World,
Chowdepalle,
Chittoor (District),
Andhra Pradesh - 517257
India

Ph : 08581-256234

Email : vijayavani_printers@yahoo.com

పుస్తకావిష్కరణ సంభందిత మరిన్ని ఫొటోస్ కోసం ఈ దిగువ న వున్నా లింక్ మీద క్లిక్ చేయగలరు.

పుస్తకావిష్కరణ ఫోటోలు
తెలుగు కార్టూన్ . కామ్ స్వాగతం పేజీ