Sunday, January 31, 2010

కళాసాగర్ కార్టూన్లు (కార్టూన్ సంకలనం)



వ్యంగ్య భరితమైన రాతలకు గీతాలను జోడించి ఆబాల గోపాలాని నవ్వించడంమే వ్యంగ్య చిత్రాకారుల ఉద్దేశం.
శ్రీ కళాసాగర్ 1995 సంవత్సరం నుండి కార్టూన్లు గీస్తున్నారు. వివిధ పత్రికలలో వేల సంఖ్య లో ప్రచురించబడినఅత్యుత్తమమైన వాటినుండి కొన్నింటిని తీసుకుని "కళాసాగర్ కార్టూన్లు" పేరుతొ పుస్తకరూపంలో మనముందుంచారు.



కవరు పేజీ వెనుక ప్రముఖ సీనియర్ కార్టూనిస్ట్ శ్రీ జయదేవ్ బాబు గారి అమూల్యమైన అభిప్రాయం, "మనిషి ఎందుకునవ్వాలి?' అనే ప్రశ్నకు జవాబుగా శ్రీ డా|| జి. సమరం గారు వ్రాసిన విజ్ఞానదాయకమైన నాలుగు మాటలు, శ్రీ ఎవిఎం గారి అభినందనలు, సీనియర్ కార్టూనిస్ట్ శ్రీ సత్యమూర్తి శుభాకాంక్షలు, శ్రీ శేఖర్ మనసులోని మాట, ప్రముఖ కారికేచర్చిత్రకారుడు శ్రీ శంకర్ మరియు మహిళా కార్టూనిస్ట్ కుమారి శ్రీ రాగతి పండరి గారు అభినందనలు మొదట నాలుగుపేజీలలో మనల్ని పలుకరిస్తాయి.

"చిరునవ్వుల వెనుక" అంటూ తన మనోగతాన్ని శ్రీ కళా సాగర్ గారు క్లుప్తంగా చెప్పి, మొదటి కార్టూన్ నుండి చివరికార్టూన్ వరకు పుస్తకము వదలకుండా చదివి, అతి తక్కువ సమయం లో ఎక్కువ హాస్యాన్ని ఆనందిచాగాలిగామనేఆనందం మనలో కలిగించేలా పుస్తకాన్ని రూపకల్పన చేసారు. చివర్లో హేయర్ కటింగ్ సెలూన్ కార్టూన్ చూడటంపూర్తయీనాక " అయ్యో!..ఇంకా కొన్ని కార్టూన్లు వుంటే బాగుణ్ణు" అనే అత్యాస కలుగక మానదు. కొన్ని సందర్భాలలోతక్కువ" కూడా "ఎక్కువ" కిక్కు ఇస్తుందనడం లో అతిశయోక్తి కాదేమో?... "

ఇతరులని రంజింపజేయడం కళాకారుల వృత్తి మరియు ప్రవృత్తి. కార్టూనిస్టు కొన్ని (అన్ని) సందర్భాలలో తన కార్టూన్లకంటే తోటి కార్టూనిస్టుల గీతాల్ని రాతల్ని చూసి ప్రేరణ పొందుతాడు. "కళాసాగర్ కార్టూన్లు" సంకలనం చదివినాకనేనెందుకు కోవలో కార్టూన్లు గీయలేకపోతున్నాను?" అనే భావన నాలో కలిగింది. (నేనెప్పుడు మాత్రం కార్టూన్లుగీసాను? ). "


నా కొడుకు, కూతురు "మనమెవరో చాటింగ్ చేసేవాళ్ళకు తెలియదు" (పేజి 9) కార్టూన్ని భోజనం చేస్తున్నప్పుడు కూడతలచుకొని పొట్ట చెక్కలయ్యేలా నవ్వటంతో నాకు కోపం వచ్చింది. వాళ్ళిద్దరికీ చాలాసార్లు చెప్పాను "భోజనంచేస్తున్నప్పుడు పొట్టచెక్కలయ్యేలా నవ్వకూడదని".


పేజి 41 లో పొడుగుగా వున్న జంతువుని కట్టె కి కట్టి పిల్లలు అటు ఇటు పిరమిడ్ ఫార్మేషన్ లో మోసుకు వెళ్ళడంఆలోచింపజేసింది.


పేజి 55 లో కార్టూన్ నాకు చురక తగిలించింది. నా పిల్లలిద్దరూ "PS2 గేమ్ కన్సోల్" కావాలని మారం చేస్తే కొని తెచ్చాను. కొత్తలో అసలు వారిని ఆడనిచ్చే వాణ్ని కాదు. రోజులో ఎక్కువ సార్లు నేనే టీవి ముందు కూర్చొని గేమ్స్ ఆడుతూ టైంపాస్ చేస్తుండేవాణ్ని.

చెప్పాలంటే ఒకటినిమించి ఒకటి. ప్రతి కార్టూన్ లో నూతనత్వం కనిపిస్తుంది. " కార్టూన్ని గతంలో ఎక్కడో చూసా.. " అనే పాత జ్ఞాపకాల్ని నేమరువేసుకుని ఆస్కారం లేని ఆణిముత్యాలు. ప్రతి రీడర్, కార్టూనిస్ట్ పుస్తక సేకరణ జాబితాలోఉండదగ్గ మంచి సంకలనం.

శ్రీ కళాసాగర్ గారి ఇతర హానర్స్ మరియు అవార్డ్స్ గురుంచి తెలుసుకోవాలంటే చాలానే వుంది.
బ్లాగు పోస్ట్ లో కేవలం "కళాసాగర్ కార్టూన్లు" (కార్టూన్ సంకలనం) గురుంచిన ప్రస్తావన చేయ ప్రయత్నం చేసాను.
తప్పులుంటే మన్నించగలరు.

kalasagar"కళాసాగర్ కార్టూన్లు" (కార్టూన్ సంకలనం) ప్రచురణకర్త వివరాలు:
స్మైల్ పబ్లికేషన్స్,
విజయవాడ, సెల్ : 9703466104
వెల : రూ. 30/-

ప్రతుల కోసం సంప్రదించ వలసిన చిరునామా:
కళాసాగర్,
#21-11/3-13, మధుర నగర్,
విజయవాడ - 520011,
Cell : 9703466104, 9885289995

విశాలాంధ్ర బుక్ హవుస్,
ప్రజాశక్తి బుక్ హవుస్ (అన్ని బ్రాంచీలలో) లభ్యమగును.

శ్రీ కళాసాగర్ ఇతర సమాచారం కోసం మరియు మరిన్ని కార్టూన్స్ చూసేందుకు తెలుగు కార్టూనిస్ట్ డైరెక్టరీ వెబ్ సైట్తెలుగుకార్టూన్.కామ్ సందర్సించగలరు.

3 comments:

పుక్కళ్ళ రామకృష్ణ said...

కళాసాగర్ గారు, మీ పుస్తకం లో ప్రతి కార్టూన్ ఓ ఆణిముత్యం.
తొందర్లోనే మరో పుస్తక ప్రచురణ చోటు చేసుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
~ పుక్కల్ల రామకృష్ణ

kaartoon.wordpress.com said...

కళాసాగర్ గారి కార్టూన్ల పుస్తకం నిజంగా అద్ద్భుతంగా ఉంది.
మీ నుండి మరిన్ని కార్టూన్ పుస్తకాలు రావాలని కోరుకుంటూ..
యమ్వీ.అప్పారావు(సురేఖ)

Kalasagar said...

థాంక్స్ రామకృష్ణ గారు , సురేఖ గారూ...

Post a Comment