Sunday, January 31, 2010

యానిమేషన్ లెసన్స్ - శ్రీ జయదేవ్ బాబు












బొమ్మకదిలేటప్పుడు వయసు, బరువు, స్వభావము తెలియాలి. వయసులో వున్న మెలికలాంటి అమ్మాయి, నడివయసు దాటినా లావుపాటి అంటి, మోతుబరి జమిందారు, తప్పటడుగులు వేసేచంటిపిల్లాడి నడకలు వేర్వేరుగా ఉంటాయి.

ఉదాహరణ కోసం చిత్రం - 1 చూడండి.






















బొమ్మ
కదలిక స్వాభావికంగా, అర్థవంతంగా, సహజానుగునంగాకంటికింపుగా వుండాలి. అందుకు సంభందించిన "కీ డ్రాయింగులు", "ఇన్ బిట్వీన్లు", "స్పేసింగులు" ఫ్రేముల సంఖ్య సరిచూసుకోవాలి. అన్ని యానిమేషన్ సూత్రాలకు కట్టుబడి వుండాలి.

యానిమేషన్ సూత్రాలని అర్ధం చేసుకునే ముందు కొన్ని ఉదాహరణలని పరిశీలిద్దాము. బరువు వస్తు స్వభావం గురించి తెలుసుకుందాము.

ఉదాహరణ కోసం చిత్రం - 2 లో రుమాలు చూడండి.

* ఒక రుమాలు ని నేల మీదకు జార విడుద్దాం.
* గాలి తాకిడికి రుమాలు విచ్చుకుంటుంది.
* మధ్య భాగం బుడపలా లేస్తుంది.
* నేలని తాకగానే, రుమాలు కు నేలకు మధ్యన ఇరుకుకున్న గాలి బయటకు వస్తుంది.
* రుమాలు పరుచుకుంటుంది.

ఉదాహరణ కోసం చిత్రం - 3 లో పిండి ముద్ద చూడండి.

* బాగా నీరు తేరిన పిండి ముద్ద, పడుతున్నప్పుడు సాగుతుంది.
* నేల తాకగానే పరచుకుంటుంది.


















ఉదాహరణ
కోసం చిత్రం - 4 లో మట్టి ముద్ద చూడండి.

* మట్టి ముద్ద దప్ఫుమని పడుతుంది.
* నేలమీద పరచుకుంటుంది.

ఉదాహరణ కోసం చిత్రం - 5 క్యానన్ బాల్ చూడండి.

* క్యానన్ బాల్ (ఫిరంగి) ధన్ మని పది నేల మట్టి చెదురుతుంది.

తరువాత లెసన్స్ లో మరో కొత్త విషయం గురించి చర్చిద్దాము.
కూర్పు - జయదేవ్ బాబు (31 జనవరి 2010).

యానిమేషన్ లెసన్స్ ని శ్రీ జయదేవ్ బాబు గారు తెలుగుకార్టూన్ డాట్ కామ్ కోసం వ్రాసారు.
తెలుగుకార్టూన్ డాట్ కామ్ లో కూడా లెసన్స్ చదివి డౌన్లోడ్ చేసుకోవచ్చును.

1 comments:

kaartoon.wordpress.com said...

ప్రియ మితృలు శ్రీ జయదేవ్ యానిమేషన్ గురించి ఇంత విపులంగా
తెలియచేసినందుకు ధన్యవాదాలు. తెలిసిన ఏ విషయమైనా చెప్పటం
సులువేగాని అతి త్వరగా అర్ధమయేటట్లు వరుస బొమ్మలు చూపిస్తూ
తెలియచేయడం జయదేవ్ బాబు గారికి ఒక్కరికే సాధ్యం !!
యమ్వీ.అప్పారావు(సురేఖ)

Post a Comment